Friday, March 30, 2018

Siri Vennela #Take-7


Take:7

ఆ అమ్మాయి ఇలా డొనేషన్ మనీ జమ చేసుకుని ఎంతో హ్యాపీగ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో తన సిస్టర్(అపర్ణ) ఒక్కతే ఓ మూలకు పడుకుని వుంటుంది అపుడు తనను లేపి


అమ్మాయి: తన చెల్లెలితో...
అప్పు ఏమైందే ఇలా మూలకు పడుకొని వున్నావు అమ్మ, నాన్న ఏరి? 

చెల్లెలు(అపర్ణ): ఏడుస్తూ....
అక్క... నాన్నకు హఠాత్తుగా ఏమైందో ఏమో ఒక్క సరిగా నాన్న ఆరోగ్యం బాగా క్షిణించే సరికి అమ్మ నాన్నను హాస్పిటల్ కు తీసుకెళ్ళింది తన చేతిలో చిల్లి గవ్వ కూడ మరి హాస్పిటల్ లో ఎలా చూపిస్తుందో ఏమో ఊ... ఊఊ...(అని బాగ ఏడుస్తుంది)

అమ్మాయి: మొహం చిన్నగ చేసుకుని
నువ్వు ఎడవకే... నేను వచ్చానుగ నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి పద మనం కుడ హాస్పిటల్ కు వెళదాం
మరి అమ్మ  నాన్నను ఏ హాస్పిటల్ కు తీసుకెళ్లిందో తెలుసా

అపర్ణ:  ఎప్పటికి తీసుకెళ్లే హాస్పిటలే ఎర్రగడ్డ లోని ముల్టి స్పెషాలిటీ హాస్పిటల్ ....

అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను (తన భర్త ను) హాస్పిటల్ లో join చేసేస్తుంది డాక్టర్స్ తన భర్త ను I.C.U లో పెడతారు డాక్టర్స్ అతడికి ఆక్సిజన్ ఎక్కించి అలాగే కొన్ని సిరంజీలు ఎక్కించేసి కొన్ని  టెస్టులు చేసాక ఆ మెడికల్ రిపోర్ట్ తో పేషంట్ పెళ్ళాం(జానకి) దగ్గరికి వస్తారు.

పేషంట్ పెళ్ళాం(జానకి): డాక్టర్... ఇపుడు నా భర్త ఆరోగ్యం ఎలా ఉంది? ఇపుడు మా ఆయన బాగానే వున్నాడు గా( బాధతో...)

డాక్టర్స్: చూడమ్మ మేము ఆయనకు అన్ని టెస్టులు చేసాక తెలిసింది ఏమిటంటే ఇపుడు మీ భర్త హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా వుంది అతని బాడీ లో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగా జరగడం లేదు దాని వల్ల అతని గుండె కు కావలసిన రక్తం అందడం లేదు, మెల్ల మెల్ల గా అతని రెండు కిడ్నీలు కూడ దెబ్బతింటున్నాయి. ఏమి చేసిన ఎంత చేసిన అతను ఇంకో 10 రోజులు కంటే ఎక్కువగా బ్రతకలేడు అది కూడ అతడ్ని ఇక్కడే వుంచి మేము చెప్పిన ట్రీట్మెంట్ చేయిస్తేనే ఓ 10 రోజులు బ్రతకడానికి అవకాశం వుంది ఆ పదిరోజులకు అతనికి దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి so ఇక మీరే ఆలొచించుకోండి మీ భర్త ను ఇక్కడే ఉంచుతార లేక ఇంటికి తీసుకెళ్తారా అది మీ ఇష్టం...

జానకి: ఇలా డాక్టర్స్ చెప్పింది వినగానే ఆమె గుండె ఆగినంత పని అవుతుంది బాగా ఏడుస్తూ... డాక్టర్స్ తో....
నాకు ఎం చేయాలో తోచడం లేదు సారు... నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి( అంటూ ఏడుస్తూ రెండు చేతి వేళ్ళు కలుపుకుని మెల్లగ కిందకు పడిపోతుంది.

డాక్టర్: చూడమ్మ మేము చేయాల్సిందంత చేశాం ఇంతకు మించి మా చేతుల్లో ఏమి లేదు మీరు బాగా ఆలోచించుకుని సాయంత్రం కల్ల మాకు ఎదో ఒకటి చెప్పండి.
(డాక్టర్ ఆమెతో ఇలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె I.C.U లో వున్న తన భర్త దగ్గరికి వెళ్లి తన భర్త కాళ్ళను మెల్లగ ముట్టుకుంటుంది అపుడు తన భర్త కళ్ళు తెరుచుకుని ఆమెతో...)


భర్త(రామయ్య): దగ్గుతూ.. ఏమైందే జానకి... ఇలా అయిపోయావు ఇంతకు ఏమైందంట నాకు డాక్టర్స్ ఏమైనా చెప్పారా

జానకి: (మొహం మీద ఓ చేయి వేసుకుని ఏడుస్తూ..) మీరు 10 రోజులకంటే ఎక్కువ బ్రతకరంట, ఆ 10 రోజులు కూడ మీరు బ్రతికి వుండాలంటే దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఇప్పటికే మీకోసం చాలా అప్పు చేసేసాను ఇపుడు ఒకే సారి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకోరావాలో అర్థం కావడం లేదు.
( ఇలా అంటూ తన భర్త కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది పక్కనే తన ఇద్దరు కూతుళ్లు వచ్చి ఈ మాట విని బాగా ఏడవడం మొదలెట్టేస్తారు. వాళ్ళ నాన్నను గట్టిగ పట్టుకొని ఏడుస్తుంటారు.)

జానకి:  తన కుతుళ్ళతో...
ఎంత ఏడ్చినా ఇపుడు ఏమి ప్రయోజనం లేదే డాక్టర్స్ కూడ ఇంతకు మించి ఇక ఏమి చేయలేమని చేతులెత్తేశారు 10 రోజులకు 3 లక్షలు ఖర్చు అవుతాయంట అంత డబ్బు మన దగ్గర లేదు అందుకే ఇక మీ నాన్న ను మనతోనే ఇంటికి తీసుకెళదాము కనీసం మీ నాన్న బ్రతికినన్ని రోజులన్న మనతో ఉన్నట్టుంటుంది. అది విని కడుపుతో ఉన్న అమ్మాయి తన తల్లితో...

అమ్మాయి: లేదమ్మ నాన్న ను ఇక్కడే వుండని మనము ఇక్కడే వుందాం,నాన్న తప్పక కొలుకుంటాడు నాన్న ఆరోగ్యం బాగు అయ్యాక అపుడు మన ఇంటికి తీసుకెళదాం. మీరు ఈ రాత్రి కి నాన్న ను ఇక్కడే ఉంచేలా డాక్టర్స్ తో మాట్లాడి ఒప్పించండి నేను పొద్దునకల్ల ఎలాగైన చేసి 3 లక్షల రూపాయలు తీసుకొస్తాను.

జానకి: నికేమైన పిచ్చా...ఈ ఒక్క రాత్రిలో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావే ఇప్పటికే నీ వల్ల చాలా అవమానాలు పడ్డాం, మళ్ళీ నువ్వు చేయరాని తప్పు ఏదైనా చేస్తే నిన్ను భరించే ఓపిక మాకు లేదమ్మ, నీ డబ్బు వద్దు ఏమి వద్దు నీకో దండం.

అమ్మాయి: లేదు, నాన్న ఇక్కడే వుండాలి నా మాట కాదని నాన్నను ఇక్కడి నుంచి తీసుకెళ్లావో నేను చచ్చినంత ఒట్టే..
(ఇలా చెప్పేసి  ఏడుస్తూ ఆ అమ్మాయి బయటికి వెళిపోతుంది)

జానకి: ఇది మనల్ని సర్వ నాశనం చేసేంత వరకు మనల్ని వదిలేలా లేదు ఖర్మ ఖర్మ దిన్ని కని చాలా పెద్ద తప్పే చేసేసాను.
జానకి తన చిన్న కూతురితో....

జానకి: అప్పు.. నువు ఇంటికెళ్లి కాస్త అన్నం, రొట్టెలు చేసుకుని తీసుకోరామ్మ మనమందరం కలిసి ఇక్కడే భోంచేద్దాము

అపర్ణ: సరే అమ్మ (తను ఇంటికి వెళ్లిపోతుంది.)

భర్త(రామయ్య): జానకి నన్ను క్షమించవే నేను మీ అందరిని కష్టాల పాలు చేస్తున్న, నా మూలంగా బోలెడంత అప్పు చేసుకున్నారు ఇద్దరు అమ్మాయిల జీవితాలు ఇంకెల బాగుపడతాయో ఏమిటో మిమ్మల్ని ఇంతగ కష్టపెట్టె బదులు నేను చచ్చిపోయిన బాగుండేది కానీ ఈ చావుకు కూడ నేనంటే ఇష్టం లేనట్టుంది అందుకే నాతో ఇలా ఆడుకుంటుంది.

జానకి: కన్నీళ్లు తుడుచుకుంటూ భర్తతో ఇలా...
నిజమేనండి  మీ వల్ల చాలా అప్పు చేయాల్సొచ్చింది, ఈ కుటుంబం మీ వల్ల చాల కష్టాల్లోకి కూరుకుపోయింది ఇంతకు మించి మిమ్మల్ని భరించడం మా ఎవరివల్ల కాదు, మీరు చెప్పినట్టుగా ఇక దీనికి ఒకటే మార్గం వుంది.

రామయ్య: ఏమిటే మరి ఆ మార్గం

జానకి: మీ చావు... ఇక మేము ఏ కొంచం కష్టాల నుంచైనా, అప్పుల నుంచైన బయటపడాలనుకున్న మీ చావు ఒకటే మార్గం

రామయ్య: ఎం మాట్లాడుతున్నావే అయిన నేను బ్రతికుండగా అదెలా సాధ్యమే?

జానకి: మీరు కాసేపు ఓర్చుకుంటే సాధ్యమేనండి, ఇదిగో ఈ మెత్తను మీ మూతి పై కాసేపు గట్టిగ ఒత్తి పట్టుకుంటాను మీరు కొంచెం సేపు తట్టుకుంటే చాలు సులువుగా మీరు ఈ నరకం నుండి బయట పడిపోతారు, మీ ఊపిరి కూడ అంతే సులువుగ ఆగిపోతుంది

రామయ్య: ఏం మాట్లాడుతున్నావో అసలు నికేమైన అర్థం అవుతుందా నేను నీకు తాళి కట్టిన భర్తనే నా గురించి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు

జానకి: భర్త కష్టాలు పంచుకునే వాడు కావాలి కానీ కష్టాలు మరింత పెంచే వాడు కాకూడదండి నన్ను క్షమించండి అంటు...
పక్కనే ఉన్న మెత్తను ను తీసుకుని తన మొగుడి ఊపిరి ఆడకుండ గట్టిగ మూతిపై ఆ మెత్తను ఒత్తి పట్టుకుంటుంది తన భర్త రెండు కాళ్ళు విల విల లాడిస్తూ తన ప్రాణాలు అక్కడే వదిలేస్తాడు పెళ్ళాం ఇక గట్టిగ ఏడవడం మొదలు పెట్టేస్తుంది ఆ శబ్దం విని డాక్టర్స్ అక్కడికి వచ్చి తన భర్తను చెక్ చేసి అతను చనిపోయాడు అని నిర్ధారించి వెళ్ళిపోతారు. అప్పటికే అపర్ణ ఇంటి నుంచి వంటచేసుకుని వచ్చి తన తల్లి సొంత తండ్రి ప్రాణాలు తీసుకోడవడం చూసిన ఇక తప్పని పరిస్థితుల్లో ఏమి చేయలేక ఆ బాధను తనలోనే మింగేసుకుంటుంది.

ఆ తర్వాత తన భర్త శవాన్ని తన కూతురితో కలిసి ఇంటికి తీసుకొచ్చేస్తుంది అప్పటికే బాగా చీకటి పడి వుంటుంది So ఆ మరుసటి రోజు తెల్లారగానే ఇద్దరు పోలీసులు వాళ్ళ ఇంటికి వస్తారు.
తన భర్త శవం పక్కనే  కూర్చుని ఉన్న జానకి అది చూసి పోలీసులతో...

జానకి: ఏమైంది సారు మీరు ఇలా ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు

పోలీసులు: చూదండమ్మ మీ కూతురు నిన్న రాత్రి నెక్లెస్ రోడ్ దగ్గర ఓ వ్యక్తి తో వ్యభిచారం చేయడానికి కి  ప్రయత్నిస్తూ అతని దగ్గరి నుంచి డబ్బులు తీసుకునే సమయం లో మాకు దొరికి పోయి తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది కానీ ఇక్కడ మీమ్మల్ని ఈ పరిస్థితిలో చూసి క్షమించి వదిలేస్తున్నాం మీ కూతురు వచ్చాక చెప్పండి ఇంకో సారి ఇలా ఏమైనా తప్పుడు పనులు చేస్తూ దొరికిందో ఆ తరువాత తన మిగిలిన జీవితాన్ని జైల్లో గడపాల్సొస్తుంది జాగ్రత్త, పొలిసులు ఇలా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

తన కూతురు( కడుపుతో ఉన్న అమ్మాయి) హాస్పిటల్ కు వెళ్ళగానే వాళ్ళ తన తండ్రి చనిపోయినట్టు తెలుస్తుంది ఆ తరువాత గుప్పెడు దుఃఖం తో కన్నీళ్లు ఆపుకోలేక ఏడుస్తూ వాళ్ళ ఇంటికి వెళుతుంది అప్పటికే అక్కడి జనం తన తండ్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి వుంటారు. ఆ అమ్మాయి వెళ్లి తన తండ్రిని పట్టుకుని బాగా ఏడుస్తుంది చివరికి తన తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగి ఇంటికి వచ్చే సమయం లో తన తల్లి(జానకి) తన బట్టలు సర్ది బ్యాగ్ లో నింపేసి అమ్మాయి ఇంట్లోకి అడుగు పెట్టె సమయం లో ఆ బ్యాగ్ ను బయటకు విసిరేసి తన కూతురితో..

జానకి: ఆగు ఈ ఇంట్లో నువ్ అడుగు పెట్టడానికి వీల్లేదు నీ వల్ల మేము పడిన కష్టాలు ఇక చాలు ఇక నిను భరించడం నా వల్ల కాదు, అయిన ఒకవైపు తండ్రి చనిపోయి శవం తో ఉంటే నీకు ఎవరితోనో సరసలాడాలని ఎలా అనిపించిందే రాక్షసి, ఎప్పుడు రాని పోలీసులు నీ వల్ల మొదటిసారిగా ఈ ఇంటికి వచ్చారు. ఇక చాలమ్మ తల్లి నువ్ ఎక్కడికైనా వెళ్లిపో ఎవరితో అయిన వుండు,వ్యభిచారం చేయి ఇంకా ఏమైనా చెయ్యి నాకు ఎలాంటి అబ్యంతరం లేదు ఇక బయలుదేరు తల్లి.

చిన్న కూతురు అపర్ణ తన తల్లితో
అపర్ణ: అమ్మ నాన్న అంత్యక్రియలు జరిగి ఒకరోజు కూడ కాలేదు అపుడే ఇలా చేసి అక్కను అవమానుచడం ఎం బాగలేదు అయిన మనల్ని వదిలేసి తాను ఒక్కతే ఎక్కడ అని వుంటుంది ఎలా అని వుంటుంది.

జానకి: నువ్వు నోరు మూసుకుని వుండు తను ఎక్కడికెళ్లినా ఏమైపోయిన అది నాకు అనవసరం నాకు ఒకటే కూతురు ఉంది అనుకుంటాను నీకు నీ అక్కపై మరి అంత ప్రేమ, జాలి వుంటే నువ్వు కూడ నా ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు.

తన పెద్ద కూతురు కడుపుతో ఉన్న అమ్మాయి
అమ్మాయి: అమ్మ... (అంటూ మాట్లాడే లోపే...)

జానకి: నువ్వు ఇంకేం మాట్లాడకు ఇకపై నువ్ ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ప్రయత్నించావో నేను చచ్చినంత ఒట్టే...

అమ్మాయి: అమ్మ అంత పెద్ద  పెద్ద మాటలు వద్దులే , నువ్వు ఎప్పుడు సంతోషంగా ఎల్లప్పుడూ నవ్వుతూ వుండాలి అనేదే నా కోరిక,నేను ఇల్లు వదిలేసి వెళ్లిపోవాలి అనేదే ని చివరి మాటైతే తప్పకుండ వెళతాను,ఇన్ని రోజులుగ నిన్ను నానా రకాలుగా బాధ పెట్టాను వీలైతే అందుకు నను క్షమించు, చెల్లెలిని బాగా చూసుకో.
తన చెల్లెలు ఆపడానికి ఎంత ప్రయత్నించిన వినకుండ చివరికి  తనకు నచ్చచెప్పి అక్కడ పడి వున్న తన బ్యాగ్ ను ఎత్తుకుని గుప్పెడు దుఃఖం తో వెళ్లిపోతుంది.


No comments:

Post a Comment

My Recent Posts

Siri Vennela #Take-7