Monday, March 12, 2018

Siri Vennela #Take-5


Take:5

హరి అండ్ రూప్ హ్యాపీ గ వికారాబాద్ కు చేరుకున్నారు ఇక  ఇక మరుసటి రోజు సోమవారం నాడు హరి పెళ్లి చూపులకని ఇంట్లో అందరూ హడావుడిగ ఎవరికి వారు ముస్తాబయ్యే పనిలో వున్నారు.
రూప్ రెడి అయ్యి ఇంటి బయట ఒక కుర్చీలో కూర్చొని ఫోన్ లో అలా టైం పాస్ చేస్తున్నపుడు హరి వాళ్ళ అమ్మ(శైలజ) రూప్ కు టీ ఇవ్వడానికి వస్తుంది.

శైలజ (హరి వాళ్ళ అమ్మ రూప్ తో...):
హరి తో లోపలే వున్నావేమో అనుకుంటే ఇలా ఒక్కడివే బయటకు వచ్చి కూర్చున్నావేంటి బాబు ఇదిగో టీ తీసుకో...ఎందుకు మా ఇల్లు నచ్చ లేదా నీకు?

రూప్: ఆబ్బె అలా ఎం లేదమ్మ బయటి వెదర్ కాస్తా బాగుంటేను అలా వచ్చి కూర్చున్నాను అంతే..
హరి ఎం చేస్తున్నాడు?

శైలజ: లోపలే రెడి అవుతున్నాడు బాబు..నువ్వు కూడా వెళ్లి వాడికి కాస్తా సహాయం చేయొచ్చు కదా ముందే వాడి పెళ్ళి చూపులు ఈ రోజు
మీరిద్దరూ ఎలా పరిచయం అయ్యారో ఏమో తెలియదు కానీ వాడు ఫోన్ చేసిన ప్రతి సారి నీ గురించే చెబుతుంటాడు నా ఫ్రెండ్ చాలా మంచోడు, ఈ రోజు ఇలా చేసాడు ,ఆ రోజు అలా చేసాడు, మేము ఇక్కడ తిరిగాము, మేము అక్కడ తిరిగాము అని అంత నీ గురించే మాట్లాడుతుంటాడు అనుకో, నిజంగా నీలాంటి స్నేహితుడు మా హరి కి దొరకడం అది మా అందరి అదృష్టం.

రూప్: ఛా... అవేం మాటలు అమ్మ ఎదో నా గురించి ఎక్కువగా ఊహించుకుని ఏదేదో చెప్పి వుంటాడు నేను వాడిలాగె ఓ మాములు మనిసినే కదా వాడు నా గురించి మీకు అలా చెప్పడం అది వాడి అమాయకత్వం.

శైలజ: ఇద్దరికి ఇద్దరు అలాగే వున్నారు వాడు నీ గురించి నువ్వేమో వాడి గురించి పొగడుకోవడం  బాగుంది మీ ఇద్దరి జోడి.(కాస్తా నవ్వుకుంటూ).


హరి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రూప్ ను చూసి...

హరి: ఒరేయ్ రూప్ లోపలికి రారా.. నేను కాస్తా రెడి అవుతున్నాను వచ్చి నువు కూడా  కాస్త హెల్ప్ చేయొచ్చు కదా..

రూప్: నిను రెడీ చేయడానికి కు నేనె కావాలా బే నీ....
హరి వాళ్ళ అమ్మతో రూప్ :  అమ్మ హరి పిలుస్తున్నాడు వాడికేదో కావాలంట వెళ్లి జర చూస్తాను

శైలజ: అలాగే బాబు వెళ్ళీ వాడికి బాగా ముస్తాబు చేయి మరి

రూప్: సరే అమ్మ ..( రూప్( ఇంట్లో కి)హరి దగ్గరికి వెళతాడు)

హరి:  అరె మామా చూడు ఎలా కనిపిస్తున్నానో.. ఈ డ్రెస్సు బాగా సెట్ అయ్యిందా నాకు , బాగా లేకపోతే చెప్పు ఇంకోటి ట్రై చేస్తాను జర చూసి చెప్పు మామ

రూప్: ఇపుడే ఇంత సోకు మీద వుంటే ఇక పెళ్లి కుదిరాక ఆగేలా లేవే...

హరి: చల్ పో బే నాకు సిగ్గేస్తుంది

రూప్: అబ్బ.. సిగ్గే... ఇక తయారైంది చాలు గానీ తొందరగా వెళదాం పదర లేకుంటే ఇక్కడే ఆలస్యం చేసి పిల్లను చూడక ముందే నీ పెళ్ళి చెడగొట్టుకోకు.

హరి: అవును నిజమేరో... వెళ్లి అమ్మ నాన్నలను తొందరగ రెడీ అవ్వమని చెబుతా..
ఎమనుకోకు మామ నిజంగ మంచిగ కనిపిస్తున్నాన?

రూప్: మేడి పండు లాగా ఎర్రగా బాగ నిగనిగ లాడుతున్నావుర చాలా ఇంకెమైన చెప్పాలా

హరి: అర్రే... కోప్పడకు చిచ ఇక్కడే కూర్చో 10 నిమిషాల్లో ఇంట్లో వాళ్ళందర్ని రెడీ చేస్కోస్తా.

హరి వాళ్ళ అమ్మ, నాన్న,అన్న,చెల్లెలు,వదిన అండ్ చుట్టాలు అందరు రెడీ అయ్యి ఓ మంచి కారు, ఒక సుమో బుక్ చేసుకుని దాదాపు 20 మంది దాకా హరి పెళ్లి చూపులకు వెళతారు. అమ్మాయి తల్లీ,తండ్రులు వీళ్ళను సాదర మర్యాదలతో ఆవ్హానించి ఇంటికి తీసుకెళ్తారు.

పెళ్ళీ కూతురు ఇంట్లో పెళ్ళి చూపుల సమయం లో....

పంతులు: అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి

పెళ్లి కూతురి ఫ్రెండ్స్ అందరూ తనను బాగా ముస్తాబు చేసి అమ్మాయిని తన అమ్మ నాన్నల దగ్గర కూర్చోబెడతారు.

పంతులు: అమ్మాయి తల్లి తండ్రి, అబ్బాయి తల్లి తండ్రి... మీ అమ్మాయి, అబ్బాయి కి సంబంధించిన విషయాలు ఏమైనా అడగడలచు కున్నట్టైతే ఇపుడే అడిగి తెలుసుకుని అలాగే మీ కట్నం కానుకల గురించి ఓ మాట మాట్లాడుకుంటే రాబోయే ఈ వారం రోజుల్లో నిశ్చితార్టానికి మంచి ముహూర్తం పెట్టి అదే రోజు వీరి పెళ్లికి దివ్య ముహూర్తం ఖరారు చేస్తాను మరి మిరేమంటారు.

పెళ్ళి కూతురి తండ్రి( శివయ్య): మీరు చెప్పేది కూడ బాగానే వుంది పంతులు గారు

పంతులు: అయితే ఇక ఆలస్యం దేనికి మొదలు పెట్టండి.

పెళ్ళి కూతురు చాలా అందంగా వుంటుంది హరి వాళ్ళ అమ్మ నాన్నలకు, వాళ్ళ చుట్టాలకు అందరికి బాగా నచ్చేస్తుంది
హరి వాళ్ళ అమ్మ(శైలజ) హరి నాన్నతో(వీరయ్య) (తన భర్త తో)

శైలజ: ఏవండి అమ్మాయి లక్షణంగా వుంది కదా...
వీరయ్య: అవునే అమ్మాయి లక్షణంగ చూడ ముచ్చటగా వుంది
హరి చెల్లెలు (స్వప్న) హరి తో..

స్వప్న: అన్నయ్య అలా అమ్మాయిలా సిగ్గు పడుతు తల దించి కూర్చోకు అమ్మాయి ఎలా వుందో చూసి చెప్పు నాకైతే బాగా నచ్చింది( ఎంతో హ్యాపీగా..)

హరి: హరి కాస్తా సిగ్గు పడుతూ అమ్మాయి వైపు చూసి... నాకు కూడ తను నచ్చింది

హరి వాళ్ళ నాన్న వీరయ్య
వీరయ్య: ఎమ్మా... నువ్వు మా అందరికి బాగా నచ్చావు ఒక సారి నువు కూడ మా అబ్బాయి ని చూసి నచ్చాడో లేదో చెబితే మిగతా విషయాలు ఏమైనా వుంటే మాట్లాసుకుంటాం.

పెళ్లి కూతురు తల పైకి లేపి తను కూడ బాగ సిగ్గు పడుతూ హరి ని చూసి

ప్రేమ లత(పెళ్లి కూతురు): నాకు కూడ ఆయన బాగ నచ్చాడు


రూప్: పంతులు గారు పెళ్లి విషయాలు అన్ని మాట్లాడుకున్నాం, ఇక నిశ్చితార్టానికి మంచి ముహూర్తం పెట్టండి.
పంతులు: చూడు బాబు వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం వుంది ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుని తాంబుళాలు మార్చుకుంటే ఇక సగం పెళ్లి అయిపోయినట్టే.

అందరు ఒకరితో ఒకరు మాట్లాడుకుని అందరు కలిసి మెలిసి పోయి చివరికి అక్కడ భోజనం చేసి హరి వాళ్ళు అందరు సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు.

తరవాత రోజు రూప్ హరి తో..

రూప్: రేయ్ హరి సరే మరి నేను వెళతాను ఎలాగో ఇంకో రెండు మూడు రోజుల్లోనే కదా నీ నిశ్చితార్థం వుంది ఇక నువు నీ ఎంగేజ్మెంట్ తరువాతనే ఇపుడు వచ్చి కూడ ఎం చేస్తావు

హరి: అలా అంటున్నావేంట్రా మరీ నువ్వు ఉండవా నాతో నా నిశ్చితార్టానికి

రూప్: sorry ఏమనుకోకుర కుదిరితే నీ ఎంగేజ్మెంట్ కు తప్పకుండా వస్తాను. (హరి ఎంత చెప్పినా రూప్ వినడు..)

హరి: ఇంతగా చెప్పిన వినడం లేదు కదా వెళ్లరా నాకు కూడ టైం వచ్చి నపుడు చెప్తా నీ సంగతి, ఇపుడు వెళ్లడం కాదు నా నిశ్చితార్టానికి నువు తప్పకుండా రావాలి లేకుంటే నేను ఆ నిశ్చితార్థం ఆపేస్తాను గుర్తుంచుకో ఇది జోక్ ఏమి కాదు సీరియస్ గానే అంటున్న

రూప్: సరే నీ నిశ్చితార్టానికి తప్పకుండ వస్తాను ఒకే నా...

(రూప్ హరిని ఎలాగో అలా ఒప్పించి తిరిగి హైదరాబాద్ కు వచ్చేస్తాడు, రూప్ తన రూం కు వెళ్ళగానే అక్కడ మెస్త్రి, మెస్త్రి పెళ్ళాం ఇద్దరు రూమ్ బయట దినమైన పరిస్థితి లో పడి వుంటారు.)


No comments:

Post a Comment

My Recent Posts

Siri Vennela #Take-7