Wednesday, March 14, 2018

Siri Vennela #Take-6



Take:6

తన రూమ్ ఎదుట మెస్త్రి, మెస్త్రి పెళ్ళాన్ని ఇలా దినమైన పరిస్థితిలో పడి ఉండడాన్ని చూసి రూప్ ఒక్క సారిగా షాక్ అవుతాడు వెంటనే వాళ్ళను లేపి,ఇంట్లోకి పిలిచి మెస్త్రి పెళ్ళాం తో ఇలా....


రూప్: అక్క ఎం జరిగింది అక్క..., నాకు కనీసం చెప్పకుండా నా రూమ్ కు రావడం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి? ఆ ఒంటి పై ఆ దెబ్బలు ఆ రక్తపు మరకలు అసలు ఎం జరిగిందక్క?


మెస్త్రి పెళ్ళాం: ఇలా నీకు కనీసం చెప్పకుండా నీ రూమ్ కు రావడం తప్పే తమ్ముడు కానీ మేము ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎటు వెళ్లాలో తెలియక నీ దగ్గరికి వచ్చేసాం .ఆ సమయంలో నువ్వు మాత్రమే మమ్మల్ని గుర్తొచ్చావు అందుకో కనీసం నిన్ను చెప్పకుండా వెంటనే ఇక్కడికి వచ్చేసాం( బాధ పడుతూ...)


రూప్: అది సరే అక్క.. కానీ మీ ఒంటిపై ఈ దెబ్బలేంటి అసలు ఎం జరిగింది ఇంతకు?


మెస్త్రి పెళ్ళాం: ఎం చెప్పమంటావ్ తమ్ముడు..ఎవరో రౌడీలు మా ఇంట్లోకి వచ్చి మా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమని మాతో గొడవపడి మమ్మల్ని ఇలా చితక బాది, ఇంట్లో అంత వెతికి ఇంటిని చిందర వందర చేసి వారం రోజుల్లోపు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే మమ్మల్ని చంపేస్తామని బెదిరించి వెళ్లారు. మీ మెస్త్రి కాస్త వాళ్లకు ఎదురు తిరిగి మాట్లాడే సరికి అతడ్ని ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో, కర్రలతో కొట్టి వెళ్లిపోయారు.(బాగా ఏడుస్తూ..)

పది సంత్సరాలు.. పది సంత్సరాలు నుంచి రాత్రనక, పగలనక ఒళ్ళు వంచి, చెమటలు కార్చి కష్టపడి పైసా పైసా మా రేపటి భవిష్యత్తు కోసం కూడ బెట్టుకుంటే ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు మేము ఇన్నాళ్లుగా చెమటోడ్చి కష్టపడింది పరాయివాళ్లను ధారపోయడానికేన.

రూప్: మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయార?


మెస్త్రి: పొలివేసులకు లేక ఇంకెవ్వయికైన ఈ విషయం గురించి చెబితే చంపేస్తామని మరి భయపెట్టి వెళ్లారు బాబు..ముందే మాకు దిక్కు,మొక్కు ఎవరు లేరు ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక మాకు జరగరానిది ఏదైనా జరిగితే మేము ఏమైపోవాలి మా బ్రతుకులు ఎం కావాలె.


రూప్: టెన్షన్ పడకు మెస్త్రి మీకు నేను వున్నాను, మీరు ఇలా భయపడి దాక్కుంటే మీ లాంటి వాళ్ళ జీవితాలు ఇలాగే మిగిలి పోతాయి మీకు నేనున్నాను పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము ఇలా ఎవరికో భయపడి వాళ్ళు ఎదో చేసేస్తారని ఇలాగే కూర్చుంటే మనం బ్రతకలెం, ఈ రోజు వీళ్ళు వచ్చి భయపెట్టారు రేపు ఇంకోరు వచ్చి ఇలాగే మళ్ళీ భయపెట్టరని ఏముంది.


మెస్త్రి పెళ్ళాం: నువ్వు ఇంతగ ధైర్యం చెప్పి మాకు తోడుగా వుంటానంటున్నావు ఇంతకంటే మాకు ఇంకేం కావాలి తమ్ముడు నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాము కానీ ఒక్క నిమిషం...

ఇదిగో ఈ బస్తాలో మేము 10 సంవత్సరాల నుంచి మేము పైసా పైసా కూడ గట్టుకుని దాచుకున్న 10 లక్షల రూపాయలు వున్నాయి .ఇన్ని రోజులుగా ఈ డబ్బు మా దగ్గరే దాచుకున్నాం కానీ ఇదంత జరిగాక ఇక మా దగ్గర ఇంత డబ్బును వుంచుకోలేం అందుకే నీకు ఇస్తున్నాం. నువ్వు ఈ డబ్బును నీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకుంటావని నీ మీద నమ్మకంతో నీకు ఈ డబ్బులు ఇస్తున్నాం, ఈ డబ్బు  డబ్బు మాత్రమే కాదు ఇది మా భవిషత్తు ఇదే మా ప్రాణం అని గుర్తు పెట్టుకుని మేము తిరిగి అడగనంత వరకు జాగ్రత్తగ నీ దగ్గరే దాచిపెట్టుకో.

రూప్: భయపడకు అక్క.. మీ డబ్బుకు నా ప్రాణం అడ్డు పెట్టి భద్రంగ చూసుకుంటా మీకు ఎప్పుడు తీసుకోవాలి అనుకుంటే అపుడు నాకు ఒ మాట చెప్పండి చాలు ఇపుడు నాకు ఏ విధంగా అయితే ఈ డబ్బులు ఇస్తున్నారో తిరిగి ఇదే విధంగ మీకు అప్పజెపుతాను సరేనా.

పొద్దుట్నుంచి ఏమి తినకుండ ఆకలితో ఉన్నట్టున్నారు మీరు కాస్త మొహం కడుక్కుని ఫ్రెష్ అప్ అయి వస్తే ఆలోపు మీకు వేడి వేడి అన్నం వండి పెడతాను. అందరం తిన్నాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ రాయించి వద్దాం,

మెస్త్రి తో రూప్...

మెస్త్రి బాధ పడకు జరిగిందంత ఓ పీడ కల అని మరచిపొ నీకు నేనున్నా నువ్వేమి టెన్షన్ పడకు సరేనా

మెస్త్రి వాళ్ళు కాళ్లు, చేతులు కడుక్కుని వచ్చే లోపు రూప్ అన్నం వండి పెడతాడు తరవాత అందరూ తినేసి సాయంత్రం టైం లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ రాయించి తిరిగి రూమ్ కు వచ్చేస్తారు.


రూప్: మెస్త్రి మొన్న హరి పెళ్లి చూపులకని వెళ్ళాం కదా అయితే ఈ శుక్రవారమే వాడి నిశ్చితార్థం వుంది ఆ రోజు మనం అందరం వాడి నిశ్చితార్టానికి వెళదాము అంత వరకు మీరు ఇక్కడే వుండండి. అక్కడికి వెళ్ళొచ్చాక మీరు మీ ఇంటికి వెళుదురు కానీ సరేనా అంత వరకు నా ఇంట్లో మీరు నా అథితులుగా వుండి నా ఆథిత్యాన్ని స్వీకరించండి...


మెస్త్రి: సరే రూప్ సింగ్ నువ్వు ఎలా అంటే అలాగే నీ మాట కాదనగలమా మేము, మా ఇంటికి మిమ్మల్ని పిలుద్దామనుకుంటే అంత లోపే మేమె మీ ఇంటికి రావాల్సొచ్చేసింది ఏందో ఇదంత..


రూప్: సర్లే మెస్త్రి హరి వచ్చాక మేము కూడ మీ ఇంటికి తప్పకుండ వస్తాములే ఇక టైం. అయిపోయింది పడుకోండి మళ్ళీ పొద్దున్నే మనం పనికి వెళ్ళాలి.

(ఇక అందరూ పడుకుని ఉదయం లేచి రెడీ అయ్యి ముగ్గురు వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనికి వెళ్లి పోయారు అండ్ ఇలాగే రెండు మూడు. రోజులు గడిచిపోయాయి.)

హరి నిశ్చితార్థం రోజు రానే వచ్ఛేసింది రూప్, మెస్త్రి, మెస్త్రి పెళ్ళాం ముగ్గురు హరి నిశ్చితార్టానికి వెళతారు అక్కడ హరి ఎంగేజ్మెంట్ ఎంతో గ్రాండ్ గా ఎంతో హ్యాపీ గా జరిగిపోతుంది. అదే నెలలో ఓ 15 రోజుల తరువాత పెళ్లి ముహూర్తం కూడ ఖరారైపోతుంది. ఓ వారం రోజుల పాటు విళ్ళతో కలిసి ఉందాం అనుకోని ఆ మరుసటి రోజు హరి కూడ విళ్ళతో పాటు హైద్రాబాద్ కు వచ్చేస్తాడు.


నలుగురు సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి బయటికి వస్తున్నపుడు కడుపుతో ఉన్న ఆ అందమైన అమ్మాయి రోడ్డు పైన జనం లో డొనేషన్ అడుగుతూ వీళ్ళకు కనబడుతుంది.

కడుపుతో ఉన్న ఆ అందమైన అమ్మాయి ఒక డొనేషన్ బాక్స్ పై donate please అని వ్రాసి  అక్కడ ఎదురొచ్చే మనుషుల దగ్గర నుంచి డబ్బులు అడుగుతుంటుంది.

అమ్మాయి: ఒక వ్యక్తితో సర్.. ప్లీస్ ఎంతో కొంత సహాయం చేయండి మీరు చేసే ఈ ఒక్క సహాయం మా జీవితం లో చాలా మార్పును తెస్తుంది please సర్ ఎంతో కొంత సహాయం చేయండి సర్...please సర్..


ఆ వ్యక్తి: ఓ 50 రూపాయలు తనకు donate చేసి వెళ్లి పోతాడు ( ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత డబ్బు సహాయం చేయమని అడుగుతుంటుంది. కొందరు ఎంతో కొంత donate చేస్తుంటే కొందరు అలాగే వెళ్లిపోతుంటారు ఇలాగే రూప్, హరి,మెస్త్రి వాళ్ళు కూడ ఆ అమ్మాయికి ఎదురొస్తారు.వాళ్ళ దగ్గర కూడ తను ఎంతో కొంత సహాయం చేయమని అడుగుతుంది.


అది చూసి హరి రూప్ తో.....

హరి: ఒరేయ్ రూప్ మొన్న మనకు రైల్వేస్టేషన్ లో కనిపించిన అమ్మాయిరా...
ఒక్కో రోజు ఒక్కో రోల్ లో కనిపిస్తుందిర ఈ దేవత... నా కోనేరు హంపి...ఈ కుందనపు బొమ్మ దీన్ని కన్నదానమ్మ...

అమ్మాయి: హలో సర్.. ఎదో హెల్ప్ చేయమని అడిగాను మీకు హెల్ప్ చేయాలనిపిస్తే చేయండి లేదంటే చేయకండి కానీ ఇలా మీ తప్పుడు మాటలతో నన్ను అవమానించే హక్కు మీకు లేదు.


మెస్త్రి పెళ్ళాం: హరి... ఎవర్రా ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా?


హరి: మొన్న నేను రూప్ మా ఊరికెళుతున్నపుడు బేగంపేట రైల్వేస్టేషన్ లో కనబడింది అక్క, ఈ రోజేమో మళ్ళీ ఇక్కడ కలిసింది కానీ ఆ రోజు తను ఇంకో క్యారెక్టర్ ప్లే చేస్తుండే, ఈ రోజు ఈ అడుక్కునే గెటప్ లో వుంది.


హరి ఆ అమ్మాయితో...

హరి: అవును మహా తల్లి ఇదొక్కటే నీ మెయిన్ రోలా లేక ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా సినిమాలో ట్రై చేయకపోయావా? ఆ రోజు ని ఫేస్ చూసి నీ అందానికి ఫిదా అయిపోయాను కానీ తరువాత మీ బాడీ షేప్ ను చూసాకే తెలిసింది నేను ని గురించి ఎంత తప్పుగ ఊహించుకున్నానో అని.

అమ్మాయి: (సైలెంట్ గా చాలా సున్నితంగా ) హలొ సర్... మీరు మరి ఎక్కువగా మాట్లాడున్నారు ఇంత కంటే ఎక్కువ మాట్లాడారో తర్వాత....


హరి: మరి ఎంటే రాక్షసి... చంపేస్తావ... కత్తితో పొడిచేస్తావ.. దా చంపేయ్ దా...


అమ్మాయి: అమ్మాయి హరి మాటలకు ఏడ్చేస్తుంది


మెస్త్రి: హరి ఆ అమ్మాయి గురించి మనకు ఎందుకులేరా... వదిలెయ్ వెళ్దాం పద


మెస్త్రి పెళ్ళాం: అరేయ్ హరి ఆ అమ్మాయి ఎలాగుంటే నీకేందుకురా అనవసరంగా తనతో ఎందుకు గొడవ పడుతున్నావు.

మెస్త్రి పెళ్ళాం ఆ అమ్మాయి తో...
చూడమ్మ మా తమ్ముడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్న సారీ అమ్మ ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచుకో

హరి: అక్క నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావక్క.. ఏయ్ ఇక్కడ ఇచ్చేయ్వే ఆ ఆ డబ్బులు


రూప్: రేయ్ హరి వదిలెయ్ రా ఆ అమ్మాయిని ఇంకెంత గా ఎడిపిస్తావు

అయిన ఆ అమ్మాయి బాధలు, కష్టాలు తన ప్రాబ్లమ్స్ తనకు ఏవో వుంటాయిలే లేకుంటే ఇలాంటి సిచుఎషన్ లో ఎందుకు వుంటుంది చెప్పు.

హరి: అరే అది కాదు మామ తనకు అంతగా ఎం పోయేకాలం వచ్చిందని చూడు ఇంత అందం పెట్టుకుని ఇలా కడుపు చేసుకుని, చివరికి రోడ్డు మీద అడుక్కుంటు అవసరమా ఇదంత కొంచం కూడ జ్ఞనం లేదా దినికి..

ఆ అమ్మాయి అలాగే లోలోపల ఏడుస్తూనే వుంటుంది.

రూప్ ఆ అమ్మాయితో...

రూప్: ఏవండి దయచేసి అలా ఎడవకండి ప్లీస్... మావోడు మిమ్మల్ని ఈ స్థితిలో చూసి కాస్త బాగానే హర్ట్ అయ్యాడు మీ లాంటి అందమైన అమ్మాయి ఇలా ఎందుకైందా అనే బాధ తో వాడు మీతో అలా మాట్లాడాడు తప్పా ఇంకో వేరే ఉద్దేశ్యంతో కాదు... please ఏమనుకోవద్దు
మీరు ఈ స్థితిలో ఉన్నారంటే మీ problems నేను అర్థం చేసుకోగలను అండ్ ఇలా మీరు అవ్వడానికి ఓ బలమైన కారణం వుండే వుంటుంది.
ఇదిగొండి మా అందరి తరపున ఈ 1000 రూపాయలు ఇస్తున్నాను ఈ 1000 రూపాయలు మీకు సహాయం చేసామని అనుకోకున్న మిమ్మల్ని మేము బాధ పెట్టినందుకు ఫైన్ గా అన్న ఈ డబ్బు తీసుకోండి please కాదనకండి...

అమ్మాయి: ఏడుస్తూనే నవ్వుతూ.... సరే మీరు ఇంతగా అంటున్నారని  తీసుకుంటున్నమీ ఫ్రెండ్ ను ఇలా అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టడం ఆపేయమనండి.


రూప్: సరే తప్పకుండ...అండ్ మీరు ఇలా నవ్వితే చాలా అందంగా వుంటారు సో ఇలాగే నువ్వుతూ వుండండి మీ problems కూడ మీ నవ్వును చూసి ఇట్టే మాయమైపోతాయి.

ఇక వెళతాం మరి ok న...

అమ్మాయి: ఒక్క నిమిషం!  thank you.

మీ ఫ్రెండ్ నన్ను ఎడిపించాడు, మీ వాళ్ళు నన్ను ఓదార్చారు, మీరు నన్ను నవ్వించారు. ఇపుడు ఎందుకో నాకు చాలా హ్యాపీగా గా అనిపిస్తుంది నిజంగ నా problems త్వరలోనే దూరమైపోతాయనిపిస్తుంది.
ఇలా చివరికి ఆ అమ్మాయి దగ్గరి నుంచి అందరు వచ్చేస్తారు ఆ తరువాత అక్కడి నుంచి మెస్త్రి, మెస్త్రి పెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. రూప్ అండ్ హరి మెస్త్రి వాళ్ళను బస్సు ఎక్కించేసి వీళ్ళు వీళ్ళ రూమ్ కు వెళ్ళిపోతారు.

No comments:

Post a Comment

My Recent Posts

Siri Vennela #Take-7