Friday, March 9, 2018

Siri Vennela #Take-3


Take:3

అందరు అన్నం తిన్నాక తిరిగి మళ్ళీ పని చేస్తున్నపుడు ఈ బిల్డింగ్ కు సంబంధించిన కాంట్రాక్టర్(మురళి) అక్కడికి వస్తాడు

కాంట్రాక్టర్(మురళి): ఎం మెస్త్రి పని ఎలా నడుస్తుంది కాస్తా ఆలస్యం చేసాయకుండ మనం అనుకున్న టైం లొ పని పురయ్యేల చూడు

మెస్త్రి: టెన్షన్ పడకండి సారు మీరు ఇచ్చిన టైం లోనే ఈ పని పూర్తి చేసేస్తాను

మురళి: ఎం అనుకోకు మెస్త్రి ఈ బిల్డింగ్ ఓనర్ తొందరగ పని పూర్తి చేయమని రోజు వెంట పడుతున్నాడు అందుకే అంటున్న.

అదే సమయం లో హరి కి ఇంటి దగ్గరి నుంచి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు

హరి: హలొ హ నాన్న

నాన్న: బాగున్నవా బిడ్డ

హరి: నేను బాగున్నా నాన్న, నువ్వు ఎలా ఉన్నావు అమ్మ ఆరోగ్యం ఎలా వుంది ఇపుడు?

నాన్న: మేము అందరం బావున్నాం రా. ఇదిగో వింటున్నావా ఈ  ఆదివారం ఇంటికి వచ్చేయ్ సరేనా?

హరి: ఎందుకు ఏమైంది అక్కడ  అంత మంచిగనే వుంది కదా...

నాన్న: నువ్వు అనుకున్నట్టు అలా ఏమీ లేదుర, నీకు ఓ మంచి పెళ్ళీ సంబంధం వచ్చింది, ఈ సోమవారం నీ పెళ్ళి చూపులకు వెళ్ళాలి అందుకే రేపు ఇంటికి వచ్చేయ్ అంటున్న

హరి: నన్ను ఎక్కువ రోజులు ఒంటరిగా వదిలేలా లేరే మీరు... సరే మీ మాట ఎందుకు కాదనాలి మీరు ఎలా అంటే అలాగే నాన్న

నాన్న: నీ వేషాలు ఈ నాన్న ముందు పని చేయవురా పెళ్ళీ కుదిరింది అనగానే లోపల సంబర పడిపోతున్నావని నాకు తెలుసు గానీ ఇదిగో నా ఫోన్ లో పైసలు లేనట్టున్నాయి ఇక పెట్టేస్తున్నాను ఇంటికి తొందరగ వచ్చేయ్ మరి

హరి: సరే మంచిది నాన్న వుంటాను మరి నీ ఆరోగ్యం జాగ్రత్త ( హరి   వాళ్ళ నాన్న తో మాట్లాడి ఫోన్ పెట్టేసి వాళ్ళ కాంట్రాక్టర్ తో ఇక సెలవు కావాలని అడుగుతాడు.)


హరి: మురళి అన్ననేను ఈ సోమ వారము, మంగళ వారము  రెండు రోజులు పనికి రావడం కుదరదు ఇంటికి వెళ్ళాలి

మురళి: ఎందుకు హరి ? ఎం పనుందని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు

హరి: నాకు పెళ్లి సంబంధం కుదిరిందన్న, అమ్మ నాన్న వాళ్ళు పిల్లను సుడనికి పిలిచిన్రు ఒక సారి పిల్లను చూసొచ్చాక ఒక మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకొని ఆ తరవాత ఇంకేం వుంది ఇక పెళ్ళినే

మురళి: ఓ.... సంతోషం బైయటకు వరదల పొంగి పొర్లుతుందే పెళ్లి మాట రాగానే  సరే వేళ్ళి రా మరి

హరి: మురళలన్న రూప్ కూడ నాతోనే వస్తాడు ఇక మా ఇద్దరికీ ఓ రెండు మూడు రోజులు పనికి రావడం కుదరక జర ఏమనుకోకే

మురళి: సరే సరే నీకు నచ్చి నట్టు కానీ.. ఇది నీ పెళ్లి కి సంబంధించిన విషయమని ఎం అంటలేను లేకుంటే నిన్ను అసలు వదిలే వాడినే కాదు
ఓ మెస్త్రి ...ఇక టైం అయిపోయింది పని ఆపేసి ఇంటికి వెళ్ళండి మిగతా పని సోమవారం వచ్చి చేద్దురు గానీ, రేపు ఆదివారం కదా మీ పేమెంట్ కూడ చెయ్యాలేమో ఇపుడు కాస్త తొందరగా వస్తే మీ డబ్బులు ఇస్తాను నాకు కూడ బయట వేరే పని వుంది

మెస్త్రి: సరే ఇదిగో వస్తున్నాం సారు..
( మెస్త్రి, మెస్త్రి పెళ్ళాం ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కుని కాంట్రాక్టర్ దగ్గరికి వాళ్ళ పేమెంట్ తీసుకోవడానికి వస్తారు, అలాగే హరి అండ్ రూప్ కూడ రెడీ అయి వచ్చేస్తారు.)

మురళి: మెస్త్రి ఇదిగో  ఈ ఆరు రోజులకు కలుపుకొని 7200 రూపాయలు మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలవి , హరి ఇదిగో ని 3000 రూపాయలు.

హరి: అన్న నాకు ఇంకో 2000 extra గ మని కావాలి వచ్చే వారం తిరిగి ఇచ్చేస్తాను.

మురళి: ఎప్పుడు extra డబ్బులు తీసుకుంటావు మరి ఎం చేసుకుంటావుర అంత డబ్బు ఇదిగో మీ ఫ్రెండ్ ను చూడు ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర ఎంతో కొంత  అప్పు వుంటే,  రూప్ సింగ్ కు మాత్రం లక్ష కు పైగ బాకీ పడి వున్నాను నేను
ఇదిగో రూప్ సింగ్  అందరికి పేమెంట్ చేసేటపుడు నీ డబ్బు నువ్వు తీసుకోమంటే తీసుకోకుండ నీకు బాకీ పడేలా చేసావు నన్ను, కానీ టైం కానీ టైం లో నా దగ్గర అంత డబ్బు అడిగితే మాత్రం అంత మొత్తం ఒకే సారి ఇచుకోలేను చూడబ్బ.

రూప్: సరే అన్న నాకు అవసరం వచ్చినపుడు ఓ 15 రోజుల ముందే నీకు చెబుతానులే నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు.

మురళి: ఇపుడు ఎంత ఇవ్వమంటావ్ నీకు?

రూప్: ఓ 1000 రూపాయలు ఇవ్వు చాలు..

మురళి: ఏందో అబ్బ ఒకే సారి అన్ని డబ్బులు అడిగి నన్ను ముంచేసేలా వున్నావే, ఇదిగో హరి నువ్వు అడిగిన 5000 రూపాయలు. డబ్బులు తీసుకొని అక్కడే ఉండిపోకు జర తొందరగా వచ్చేయ్ సరేనా

హరి: డబ్బులు లెక్క పెడుతూ... సరేలే అన్న తొందరగానే వచ్చేస్తాము 

మెస్త్రి అండ్ మెస్త్రి పెళ్ళాం తో హరి...
అక్క sorry అక్క  ఈ ఆదివారం మీ ఇంటికి పిలిచావు కానీ రావడం కుదరదు  ఆ తరువాత  వచ్చేఆదివారం ఖచ్చితంగ వస్తాము ఏమనుకోకే...

మెస్త్రి పెళ్ళాం: సరేలే తమ్ముడు వచ్చే ఆదివారం అయినా తప్పకుండ రావాలి మరి

రూప్: తప్పకుండ వస్తాం అక్క, మెస్త్రి ఇక మేము ఇంటికి వెళ్తాము మరి మీరు కూడ జాగ్రత్తగా వెళ్ళండి

మెస్త్రి: మంచిది,  మీరు కూడ తొందరగా తిరిగి వచ్చేయండి మీరు లేకుంటే మాకు కూడ రోజు తొందరగ గడవదు

హరి: సరే తొందరగ వచ్చేస్తాం మెస్త్రి ఇక మీరు వెళ్ళండి చీకటి పడేలా వుంది
( మెస్త్రి వాళ్ళను ఇంటికి పంపించేసి,రూప్ అండ్ హరి ఇద్దరు రూమ్ కు వెళ్లిపోతారు, కాంట్రాక్టర్ కూడ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హరి, రూప్ ఇద్దరు రూమ్ కు వెళ్లి అన్నం వండుకుని అలా కాసేపు టీవీ చూస్తు ఇద్దరు మాట్లాడుకుంటూ నిద్రపోతారు.)

Next Day Morning 9AM:

హరి సొంతూరు వికారాబాద్ so ఇద్దరు హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు వెళ్ళడానికి రెడీ అయ్యి బేగంపెట్ రైల్వే స్టేషన్ కు వెళతారు. అక్కడే టికెట్ కౌంటర్ చోట ఒక అందమైన అమ్మాయి తను కూడ టికెట్ తీసుకుంటు కనిపిస్తుంది.

హరి: ఒరేయ్ ఇటు చూడు మామా అమ్మాయి ఎంత అందంగ వుందో , చేసుకుంది ఎవడో కానీ పెళ్లి చేసుకున్నతర్వాత రోజు అదే పని మీద ఉన్నట్టున్నాడు అందుకే అమ్మాయి కూడ తొందరగ ప్రెగ్నెంట్ అయినట్టుంది.

రూప్: నోరు మూయర సన్నాసి కామం కళ్ళతో ఎవర్ని వదిలే టట్టు లేవే నువ్వు, అయిన కడుపుతో వున్న అమ్మాయి గురించి ఇలా మాట్లాడ డానికి సిగ్గుగా లేదుర నీకు? ఎదవన్నర వెధవ. నీకు కూడ ఆ సుఖ ఘడియలు తొండర్లనే రానున్నాయి అందుకే కద మనం వెళుతుంది.

హరి: మామా ఆ అమ్మాయి కాళ్ళను చూడు ఒకసారి ఆ అమ్మాయికి మెట్టెలు లేవురా మెడలో కూడ తాళి లేదు అంటే... ఒరేయ్  ఆ అమ్మాయి పెళ్ళి చెకోకుండానే కడుపుతో వుందిరా.. కావాలంటే నువ్ కూడ చూడు

రూప్: ఎవరెలా వుంటే నికెందుకురా టికెట్ తీసుకున్నావు కదా పద ఇక, లేకుంటే దెబ్బలు తింటావ్ ఇపుడు నా చేతిలో
(రూప్ హరి చెయ్యి పట్టుకుని టికెట్ కౌంటర్ నుంచి పక్కకు లాక్కెళతాడు , ఆ అమ్మాయి హరి చెప్పింది అంత విన్నప్పటికి అస్సలు పట్టించుకోనట్టుగా  టికెట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.)

హరి: మన ఇండియా పాపులేషన్ మరి కొన్ని సంత్సరాల్లో చైనా ను మించి పోతుంది అంటే నేను నమ్మలేదు కానీ ఇది చూశాక నమ్మక తప్పడం లేదురా..

రూప్: ట్రైన్ వచ్చినట్టుంది ముందు ఇక్కడి నుంచి పదర...( ఇద్దరు వెళ్లి ట్రైన్ లో కూర్చుంటారు ట్రైన్ కూడ స్టేషన్ నుంచి మూవ్ అయిపోతుంది హరి మాత్రం ఆ అమ్మాయిని చూసి అలాగే షాక్ లో ఉండిపోతాడు హరి అలా అవ్వడానికి కారణం ఆ అమ్మాయి అందం, అంత అందమైన అమ్మాయి ఇలా ఎలా ప్రెగ్నెంట్ అయింది అనేదే వాడి మనసులో మెదలుతున్న ప్రశ్న.)

No comments:

Post a Comment

My Recent Posts

Siri Vennela #Take-7