Saturday, March 10, 2018

Siri Vennela #Take-4




Take:4

మరి ఇటు వైపు కడుపుతో ఉన్న ఆ అమ్మాయి MMTS రైలు ఎక్కి భరత్ నగర్ కు వెళ్లిపోతుంది  ఆమె వుండేది కూడ అక్కడే. ఆమే రోడ్డు దాటే సమయం లో అక్కడ  ట్రాఫిక్ ఎక్కువగా వుండడం వలన తనకు కాస్తా దూరం లో మరో ఆవిడ(లేడీ Age 35) రోడ్డు దాటడానికి భయపడుతు ఉంటుంది తను కూడా ఒక ఒక ప్రెగ్నెంట్ లేడీ నే అది చూసి ఈ అమ్మాయి తన దగ్గరకు వెళ్లి తనను రోడ్డు దాటవేస్తుంది.

లేడీ:  Thank you చెల్లెమ్మ నువ్వు ఈ సహాయం చేయక పోతే బహుశా నేను రోడ్డు దాటే దానినో కాదో.

అమ్మాయి: పరవా లేదు అక్క మన తోటి వారికి సహాయం చేసుకోక పోతే ఇంకెవరికి సహాయం చేస్తాము మీరు ఎక్కడికి పోవాలో చెబితే అక్కడి వరకు మీకు తోడుగ వస్తాను.

లేడీ:  ఇక్కడే ఆ రోడ్డు అవతల వైపు మా ఆయన నా కోసం వేచి చేస్తున్నాడు అంత వరకు నాకు తోడుగా వచ్చావంటే చాలు

అమ్మాయి: సరే పద అక్క (అమ్మాయి ఆ లేడీని తన భర్త దగ్గరకు తీసుకెళుతుంది).

లేడీ: Thank you చెల్లెమ్మ 
ఆ లేడీ తన భర్త తో ఏవండి ఈ అమ్మాయి లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు తను నాకు చాలా హెల్ప్ చేసింది

లేడీ భర్త: Thank you very much sister

లేడీ: ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని ఏమైనా ఫ్రూట్స్ తీసుకెళ్ళు నాకు కూడ కాస్త సంతృప్తి గా వుంటది.

అమ్మాయి: నేను మీ దగ్గర ఏదో ఆశించి మీకు ఈ హెల్ప్ చేయలేదు అక్క, ఒక సాటి ఆడదిగా ఇంకో సాటి ఆడదానికి సహాయం చేశాను అంతే.

లేడీ: లేదు నువ్వు ఎలాగైనా తీసుకోవలసిందే లేకుంటే నా మీద ఒట్టే( అని బాగా బలవంతం చేస్తుంది).

అమ్మాయి: మీరు మరీ అంతగా అంటున్నారు కాబట్టి మీరు ఏమి అనుకోనంటే మీతో ఒక సహాయం అడుగుత.

లేడీ: సరే చేప్పమ్మా.

అమ్మాయి:  మా నాన్న ఆరోగ్యం ఏమి బాగాలేదు రోజుకు 500 రూపాయలు ఆయన మందులకు ఖర్చు చేయాలి ఒక వేళ మీరు నిజంగా నాకు సహాయం చేయ దలచు కున్నట్టైతే ఆయన మందులకు సరిపోయేంత డబ్బులు ఎంతో కొంత ఇవ్వండి.

లేడీ: మీ నాన్న ఆరోగ్యం బాగుండాలని ఇంతగ తపన పడుతున్నావు చూడు దాన్ని చూసే చెప్పొచ్చు నువ్వు ఎంత బాధ్యత గల కుతురివో ఇదిగో ఈ 1000 రూపాయలు వుంచు నేను ఇచ్చే ఈ డబ్బు తో మీ నాన్న ఆరోగ్యం బాగుపడక పోవచ్చు కానీ ఓ రెండు రోజుల మందులకు సరిపోయేంత డబ్బు ఇచ్చాననే సంతృప్తి అన్న నాకు మిగులుతుంది.

అమ్మాయి: థాంక్ యు అక్క నాకు సహాయం చేయడానికే ఆ దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడేమో (కాస్త బాధగ)

లేడీ: ఇంత చిన్న సహాయానికి అంత పెద్ద మాటలు వద్దులేమ్మా సరే మరి వుంటాను మీ నాన్న ఆరోగ్యం జాగ్రత్తగ చూసుకో...

అమ్మాయి: సరే అక్క బై..(చివరికి ఆ లేడీ తన భర్తతో  వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయేమో వాళ్ళ నాన్నకు మందులు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది.)

అమ్మాయి ఇంటికి వెళుతున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ తనను చూసి రకరకాలుగా గుసగుస లాడుతుంటారు. పెళ్లి చేసుకో కుండానే కడుపు చేసుకుందని ఒకరు, రోజు ఎంత మంది తో తిరుగుతుందో అని మరొకరు ఇలా అందరూ ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు ఆ అమ్మాయి ఏమి పట్టించుకొనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది.

ఇంట్లో మంచం మీద అనారోగ్యం తో పడుకొని ఉన్నవాళ్ళ నాన్న తో...

అమ్మాయి: హాయ్ నాన్న ఆరోగ్యం ఎలా వుంది ఈ రోజు మందులు వేసుకున్నావా లేదా?

నాన్న: ఇంకెలా వుంటాను తల్లి ఏ డాక్టర్ కు అంతు చిక్కని  గుర్తు తెలియని ఈ రోగం తో ఇంట్లోనే ఇలా మంచాన పడిపోయి మీ అందరిని కష్ట పెడుతున్నాను మీరు రోజు ఎంతో కష్టపడి తెచ్చే డబ్బులు నా మందులకే సరిపోతున్నాయి ఈ పాపిష్టి తండ్రి మీ కోసం ఏమి చేయలేక పోతున్నాడమ్మ నను క్షమించు.

అమ్మాయి: బాధ పడకు నాన్న నువ్వు తొందలోనే మా లాగ మళ్ళీ మాములు మనిషిలా తయారవుతావు ఇదిగో నీకోసం రెండు రోజులకు సరిపోయే మందులు తీసుకొచ్చాను. నాన్నఅమ్మ ఇంకా పని నుంచి రాలేదా, చెల్లెలు కూడ స్కూల్ నుంచి రానట్టుంది.

నాన్న: ఇదిగో నీ మాటల్లోనే మీ అమ్మ, చెల్లి ఇద్దరు వచ్చేసారు.

అమ్మ: తన కూతురిపై( అమ్మాయి పై) కోపం తో....
వచ్చావా తల్లీ నిన్నటి నుంచి ఎక్కడ మాయమైపోయావు, ఎవరెవరితో తిరిగొచ్చావు, ఎంత మంది తో తిరిగొచ్చావు.

నాన్న: అమ్మాయి తల్లి తో(తన పెళ్ళాం తో)
ఎం మాటలే అవి కన్న కూతురితో ఇలాగేనా మాట్లాడేది నువ్వే ఇలా అంటే మరి బయట జనం ఏమనుకోవాలి?

అమ్మ: అమ్మాయి తండ్రి తో( తన భర్త తో)
మీరు ముందు నోరు ముయండి, వున్నదే గా చెబుతున్న ఇలా రోజులు రోజులుగా ఇంట్లో నుంచి మాయమయ్యే కూతురిని ఏమనాలో మరి మిరే చెప్పండి. ఎవడితోనో కడుపు చేయించుకుని ఇంటి పేరు మర్యాద అంత బయటికిడ్చి సిగ్గు లేకుండా అదే కడుపుతో అందరి మద్యలో తిరుగుతుంది.
అసలు నా కడుపున ఎలా పుట్టావే పిరికిముండ, ని వల్ల జనం లో తలెత్తుకుని తిరగలలేక పోతున్నకదే.. అయిన అంత నా ఖర్మ ఏమి చేతకాకుండ మంచాన పడ్డ నా మొగుడు, పెళ్లికి ముందే కడుపు చేసుకున్ననా కూతురు అందరు కలిసి ఈ సంసారాన్ని నాశనం చేసిన వారే..

అమ్మాయి: ఏడుస్తూ...
అమ్మ నువ్వు అనుకున్నట్టు కాదమ్మ నేను నువు నా గురించి తప్పుగా ఊహించు కుంటున్నావు నేను నీ కూతుర్ని అమ్మ అలా ఎలా తప్పుడు పనులు చేస్తాననుకుంటున్నావు. బయట వాళ్ళు నా గురించి ఎవరు ఎలా మాట్లాడిన పట్టించుకోను కానీ ఓ కన్న తల్లివై యుండి నాతో ఇలా మాట్లాడినపుడు నాకు చాలా బాధగా ఉంటుందమ్మ...
కడుపు కడుపు అని అంటున్నావే ఇది నేను ఎవరి మీద మోజు పడో లేక డబ్బు మీద ఆశ పడో చేసుకోలేదమ్మ నాన్న అనారోగ్యం తో ఆసుపత్రిలో చేరి నపుడు డబ్బు అవసరంపడి ఎవరిని అడగాలో, ఎవరితో అడగాలో ఏమి తోచనపుడు తెలిసో తెలియకో చేసిన తప్పు వల్ల నేను ఇలా కడుపుతో అయ్యాను .

అమ్మ: మరి నువ్వు పడుకుని సంపాదించి తెచ్చిన డబ్బుతోనే మీ నాన్న బాగైపోయాడు మా జీవితాలు మారిపోయి..
నిన్ను భరించడం ఇక నా వల్ల కాదు తల్లీ , ఎవరినైనా పెళ్లి చేసుకుంటావో, లేక ఎవరితోనైన లేచి పోతావో నాకు తెలియదు కానీ నా ఇంటిని మాత్రం తొందరగ వదిలేసి వెళ్ళిపో అమ్మ నీకు దండం పెడతాను.

నాన్న(భర్త): దగ్గుతూ..కన్న కూతురితో అవేం మాటలే జర నీ నోరుని అదుపులో చేసుకుంటావా?

అమ్మ(భార్య): హా... ముందు మీరు నోరు మూసుకుని అక్కడే పడి ఉండండి అసలు మీకు అనాలి ఈ సంసారం ఇలా అవ్వడానికి కారణం మీరే. మీ మందుల కోసం ఇక్కడే బోల్డంత అప్పైపోయింది కానీ మీరు మాత్రం బాగు అయ్యేలా లేరు అలా అని చచ్చిపోయేలా లేరు మిమ్మల్ని ఇంకెన్నాళ్ళు ఇలాగే భరించాల్సి వస్తుందో ఏమో నా ఖర్మ ఖర్మ.

చెల్లెలు: అమ్మ నోరు ముస్తావా.. ఏమిటే ఆ పిచ్చి పిచ్చి మాటలు, గంట సేపటి నుంచి గోల పెడుతున్నావు నోరు ముసుకుమి అలా గప్పున ఉండరాద

అమ్మ: ఇక నువ్వు ఒక్క దానివే మిగిగిలావే నాతో వాదించడానికి
రా.. వచ్చి నా గొంతు నలిపేసి చంపేయవే నన్ను ఆ తరువాత నాన్న, అక్క, చెల్లీ ముగ్గురు కలిసి సంతోషంగ వుండండి అని బాగా ఏడ్చేస్తుంది.

(ఇది ప్రతి రోజు వీళ్ళ ఇంట్లో జరిగే కథ వీళ్ళలో ఏ ఒక్కరు కూడ దోషులు కారు, ఏ ఒక్కరు శత్రువులు కారు కాలం వీళ్ళను ఇలా కష్టాల్లో నెట్టేసి వీళ్ళను ఇలా మార్చేసింది. ఇందులో దోషం ఎవరిదైన వుందనుకుంటే  ఆ దోషం సమయానిది, ఇందులో దోషం ఎవరిదైన వుందనుకుంటే ఆ దోషం వాళ్ళను ఇలా కష్టాల పాలు చేసినా ఆ దేవుడిది.)

అందరు బాధ పడుతు, ఎవరికి వాళ్ళు కన్నీళ్లు కార్చుకుంటు ఎక్కడి వాళ్ళు అక్కడే ఏమి తినకుండా ఆకలితో ఆ రాత్రికి అలాగే పడుకుంటారు.


1 comment:

My Recent Posts

Siri Vennela #Take-7