Thursday, March 8, 2018

Siri Vennela #Take-2


Take:2

రూప్ అండ్ హరి ఇద్దరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ లో ఒక మెస్త్రి చేతి కింద పని చేస్తుంటారు
హరి అండ్ మెస్త్రి  ఇద్దరు బిల్డింగ్ side walls కడుతుంటారు మెస్త్రి పెళ్ళాం వాళ్లకు ఇటుకలు అందిస్తుంటుంది అండ్ రూప్ సిమెంట్ బస్తాలు కింది నుంచి పైకి తీసుకొచ్చి సిమెంట్ కలిపి వాళ్లకు అందిస్తుంటాడు.

మెస్త్రి తో హరి...
హరి: అవును మెస్త్రి నువ్వు, అక్క ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు?

మెస్త్రి: మేమా? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం హరి

హరి: పది సంవత్సరాల నుంచి చేస్తున్నారా? అయితే డబ్బులు బాగానే సంపాదించి వుంటారే...?
ఏం చెసుకుంటారు అంత డబ్బు?

మెస్త్రి: ఎన్ని రోజులని ఈ కూలి పని చేస్తాం చెప్పు హరి ఇపుడేదో కాస్తా వుడుకు రక్తం ఉంది చేస్తున్నాం రేపటి రోజు మాకు వయసు మళ్లాక ఎవరు చూసుకుంటారు మమ్మల్ని అందుకే ఇపుడు కష్ట పడి పైసా పైసా కూడ బెట్టుకుంటున్నాం.

హరి: ఎందుకు మీకు పిల్లలు మీకు చూసుకోరా? అంతగా కష్ట పడాల్సిన అవసరం ఎం వుంది?

మెస్త్రి పెళ్ళాం: మాకు పిల్లలు ఎవరు లేరు హరి, మాకు పిల్లలు పట్టరని తెలిసాక మేము తిరగని గుళ్ళు గోపురాలు లేవు, చుయించుకొని హాస్పిటలు లేదు  చివరికి ఎంతో కష్టపడి రక రకాల మందులు వాడాకా లేక లేక ఎంతో చూడ ముచ్చటైన బాబు పుడితే దేవుడు మాపై కారుణించడనుకుని ఎంతో సంబర పడ్డాం కానీ ఆ పసివాడి 5 ఏళ్లకే నూరేళ్లు నింపుకుని ఆ దేవుడు మా బాబును మాతో దూరం చేసేసాసు( ఇలా చెప్పి మెస్త్రి పెళ్ళాం భళ్ళు భళ్ళు న ఏడ్చి కన్నీళ్లు కార్చేసుకుంటుంది మెస్త్రి కూడా బాధ పడుతు...)

మెస్త్రి: పోని లేవే మన అదృష్టం లో పిల్లలు రాసి పెట్టలేదేమో ఆ భగవంతుడు, ఏ జన్మ లో ఏ పాపం చేశామో 5 ఏళ్ల పసి కందుని మన నుంచి దూరం చేసి ఇలా మనల్ని ఎవరు లేని ఒంటరివాళ్లను చేసేసాడు. (ఇలా మెస్త్రి అంత గుర్తు చేసుకుని అతను కూడ ఏడ్చేస్తాడు)

రూప్: అక్క బాధ పడకు అక్క మీ లాంటి మంచి మనసులను చూసి ఓర్వలేక ఆ భగవంతుడు మీకు ఇలా అన్యాయం చేసేసి వుంటాడు కానీ నువ్వు ఇలా ప్రతి సారి తలచుకుని బాధ పడితే మెస్త్రి ఏమైపోతాడో ఆలోచించు మీకు మీరే ధైర్యం చెప్పుకుని బ్రతుకు సాగదీయాలి .ఇలా ఏడ్చినంత మాత్రాన పోయిన మీ కొడుకు తిరిగి రాలేడు కదా?
బాధ పడకు మెస్త్రి ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నం తిందాం పదండి అక్క ఏడవకు మమ్మల్ని నీ సొంత కొడుకులనుకొని నీ చేతులతో అన్నం ముద్ద కలిపి పెట్టు ఎంతో హాయి గా తింటాం ఇప్పటికే చాలా ఆకలిగా వుంది.

మెస్త్రి పెళ్ళాం: అయ్యో... క్షమించు తమ్ముడు నేను కుడ పిచ్చి దాన్ని ఈ మాటల్లో పడి మరచిపోయాను పదండి తిందాము.(అక్క అన్నం వడ్డిస్తూ...) హరి ఈ ఆదివారం మీరు ఇద్దరు మా ఇంటికి తప్పకుండా రావాలి మీకు మంచిగ వేడి వేడి బిరియాని వండి పెడతాను సరేనా..?
హరి: వచ్చి మీకెందుకు కష్టపెట్టడం అక్క ఆ మాట అన్నావు చూడు అంత చాలు మాకు...

మెస్త్రి పెళ్ళాం మెస్త్రి తో..
ఏమోయ్ మెస్త్రి నువు కుడ ఒక మాట చెప్పొచ్చు కద వాళ్ళతో

మెస్త్రి: రూప్ సింగ్  ఈ ఆదివారం మీరూ మా ఇంటికి వస్తున్నారు అంతే ఇంతకు మించి ఏ ఒక్క మాట వినేది లేదు మీతో... విన్నారా?

మెస్త్రి పెళ్ళాం: ఇంతకు ముందే మిమ్మల్ని నా కొడుకుకుగా చెప్పుకొని ఇప్పుడేమో నన్ను పరాయి దాన్ని చేసేస్తున్నారు ఇదేం బాగోలేదు మరి రూప్ సింగ్ నువ్వైనా చెప్పు వాడితో మీరు ఒక వేళ రాకపోతే గనక నాతో ఎప్పటికి మాట్లాడరాదు చూడండి.

రూప్: సరే వస్తాం అక్క...

No comments:

Post a Comment

My Recent Posts

Siri Vennela #Take-7